shape

International ChotaNews

Blog Image

పోలీసులే దోషులు: మంత్రి అంబటి

ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న సిట్ బృందాన్ని కలిసి సత్తెనపల్లి సీఐపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారనని తెలిపారు. కొండపి గ్రామంలో ఘర్షణల కారణంగా ఊరంతా వలస వెళ్లారని చెప్పారు. వారిని వెనక్కి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిట్ విచారణలో పోలీసులే దోషులుగా తేలుతారని అంబటి ఆరోపించారు.

Blog Image

ఒడిశాలో మాదే అధికారం: రాజ్‌నాథ్

ఒడిశాలో తామే అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ పొత్తుగల ప్రభుత్వం 50 సంవత్సరాలు అధికారంలో ఉందని, బీజేపీ పార్టీ పొత్తుగల ప్రభుత్వం 25 సంవత్సరాలు అధికారంలో ఉందన్నారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

Blog Image

రాజమందిరంలా వైసీపీ కార్యాలయం.. ఎక్కడో తెలుసా?

విశాఖపట్నంలో వైసీపీ కార్యాలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. జూన్ 9న జగన్ విశాఖలోనే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో శరవేగంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘మహారాజ మందిరంలా పార్టీ కార్యాలయం ఉంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

పోస్టల్‌ బ్యాలెట్ వ్యవహారంపై అనుమానాలు: కలిశెట్టి

పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆరోపించారు. విజయనగరంలో అధికారుల తీరును మీడియాకు వివరించారు. ఈనెల 16న ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్‌ కౌశిక్‌, ఎంపీపీ మామిడి అప్పల నాయుడు ఆధ్వర్యలో పోస్టల్‌ బ్యాలెట్‌లను తరలించడంపై అధికారులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు.

Blog Image

భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు

భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా మరియు అరబిందోకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారీ సమస్యల కారణంగా యూఎస్‌ మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తులను రీకాల్‌ చేయాలని తెలిపింది. ఇక తమ ఉత్పత్తులను రీకాల్ చేసే దిశలో రెడ్డీస్, సన్ ఫార్మా, అరబిందో కంపెనీలు ఉన్నాయి.

Blog Image

ఆసక్తికర ఫొటో పంచుకున్న రఘురామకృష్ణరాజు

AP: నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. ఇవాళ (మే 19) భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా రఘురామ ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డిని కలిసి తీయించుకున్న ఫొటోను కూడా పోస్టు చేశారు.

Blog Image

ఇకపై పార్లమెంట్ భద్రత బాధ్యత వారిదే!

పార్లమెంటు సమగ్ర భద్రత బాధ్యతలు ఇక పూర్తిస్థాయిలో CISF నిర్వహించనుంది. సీఐఎస్‌ఎఫ్‌ ఉగ్రవాద నిరోధక భద్రత విభాగానికి చెందిన 3,300 మందికిపైగా సిబ్బంది సోమవారం నుంచి విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు CRPFకు చెందిన పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌, ఢిల్లీ పోలీస్‌, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్‌లు పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా ఈ బాధ్యతలు నిర్వహించాయి.

Blog Image

వైన్‌ షాపు వద్ద మహిళ హంగామా.. కేసు నమోదు

హైదరాబాద్‌లోని మధురానగర్‌లో తన భర్తను ఓ వైన్ షాప్ సిబ్బంది కొట్టారన్న ఆగ్రహంతో ఓ భార్య.. సదరు మద్యం షాపు వద్ద హంగామా చేసింది. వైన్ షాపులోకి చొరబడి సిబ్బందిపై దాడి చేసి, మందు బాటిళ్లను ధ్వంసం చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై తిరగబడింది. దీంతో పోలీసులు వైన్ షాపు సిబ్బందితో పాటు సదరు మహిళపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

Blog Image

వేదన చూడలేక.. ఉరి వేశారు

రాజన్నసిరిసిల్ల: మానసిక స్థితి సరిగా లేని కూతురిని ఉరివేసి హత్య చేసారో తల్లిదండ్రులు. తంగళ్లపల్లి మండలం నేరేళ్లకు చెందిన ప్రియాంక మానసిక వ్యాధితో బాధపడుతుంది. కూతురి వేదన తట్టుకోలేక తల్లిదండ్రులైన నర్సయ్య, ఎల్లవ్వలు కూతురిని ఉరివేసి హత్య చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

Blog Image

పల్నాడులో హింసకు చంద్రబాబే కారణం: అంబటి

AP: తనకు అధికారం రాదనుకుంటే దాడులు చేయించడం చంద్రబాబుకు అలవాటేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడులో జరిగిన హింసకు చంద్రబాబే కారణమని అంబటి ఆరోపించారు. పోలింగ్ రోజున పోలిస్ యంత్రాంగం విఫలమైందన్నారు. విధుల్లో అలసత్వం వహించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. ఈవీఎంలను పగలగొట్టేందుకే టీడీపీ నాయకులు దాడులు చేశారని తెలిపారు.

Blog Image

అదరగొట్టిన పంజాబ్.. SRHకు భారీ టార్గెట్

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు రాణించారు. ప్రభ్‌సిమ్రాన్(71), రోసౌవ్(49) అథర్వ్(46) రాణించడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అటు హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్, విజయకాంత్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగులు చేయాల్సి ఉంటుంది.

Blog Image

చిన్నారిని బలి తీసుకున్న కూలర్

నిజామాబాద్‌లోని గంగస్థాన్‌‌కు చెందిన వినీత్-దీపిక దంపతుల కుమార్తె స్నీటిక విద్యుత్ షాక్‌తో మృతిచెందింది. వేసవి సెలవుల నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్ళిన స్నీటిక.. తన స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కూలర్‌కు తాకడంతో విద్యుత్ షాక్‌కు గురయింది. దాంతో అక్కడికక్కడే చిన్నారి మృతిచెందింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో పూర్తిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Blog Image

ఆనంద్ మహీద్రా ట్వీట్: వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆదివారం ‘విశ్రాంతి వీక్షణ’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోను షేర్ చేస్తూ.. సండే విశ్రాంతిగా వీక్షించడం కోసం ఇది. ప్రపంచంలోని అతిపెద్ద పర్యాటక జనాభాలో భారతీయులు ఒకరు అంటూ పేర్కొన్నాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Blog Image

సీఎం జగన్‌పై మండిపడ్డ జేడీ లక్ష్మీనారాయణ

ఏపీ సీఎం జగన్‌పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండించిన ఆయన.. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లడమేమిటని ప్రశ్నించారు. శాంతి భద్రతలను కాపాడవలసినది ముఖ్యమంత్రి, మంత్రులేనని తెలిపారు.

Blog Image

లాఠీ దెబ్బలకు చలించక.. ప్రత్యర్థికి అండగా నిలిచాడు!

AP: చంద్రగిరి మండలం తుంగరామపల్లికి చెందిన వైసీపీ నేత చంద్రశేఖర్.. తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థిపై భౌతికదాడిని వ్యతిరేకించి వైసీపీకి రాజీనామా చేశాడు. అనంతరం ఆ దాడిలో గాయపడిన వారిని పరామర్శించాడు. తిరిగి వెళ్తుండగా.. కేంద్రబలగాలు లాఠీఛార్జీ చేయగా.. చంద్రశేఖర్ నిర్భయంగా లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నాడు. లాఠీలతో తమను భయపెట్టలేరని చెప్పకనే చెప్పాడు. కాగా.. స్థానిక పోలీసులు ఆయనకు నచ్చజెప్పి అక్కడ్నుంచి పంపించారు.

Blog Image

అప్పుడు స్కోరు బోర్డు వైపు చూడలేదు: యశ్

నిన్న CSKతో జరిగిన మ్యాచ్‌లో.. RCB గెలుపులో కీలక పాత్ర పోషించిన బౌలర్ యశ్ దయాళ్ మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చివరి ఓవర్ వేస్తున్నప్పుడు తాను స్కోర్ బోర్డు వైపు చూడలేదని చెప్పుకొచ్చాడు. తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టినా..తర్వాత బాల్‌కే ఔట్ చేసినట్లు తెలిపాడు. ఇదే మ్యాచుకు టర్నింగ్ పాయింట్ అని, బౌలింగ్‌పైనే దృష్టిపెట్టానని.. కోహ్లీ సూచనలు పనికొచ్చాయన్నాడు.

Blog Image

సోనియా గాంధీపై ప్రధాని విమర్శలు

రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోటీకి దిగడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘‘సోనియా గాంధీ రాయ్‌బరేలీని వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం తన కుమారుడిని రాయ్‌బరేలీ ప్రజల చేతుల్లో పెడుతున్నానంటూ.. ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ పోటీలో దింపడానికి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ అభివృద్ధి కోసం పని చేసిన ఒక్క కార్యకర్త కూడా మీకు కనిపించలేదా?’’ అని మోదీ ప్రశ్నించారు.

Blog Image

ఫోన్‌లో డాక్టర్‌ సలహాలతో నర్సుల ఆపరేషన్‌.. శిశువు మృతి

వరంగల్ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. మహబూబాబాద్‌లోని మరిపెడ మండలం గుండెపుడికి చెందిన కసిరెడ్డి శ్రీజ పురిటినొప్పులతో ఈనెల 16న ఆసుపత్రిలో చేరింది. 17న నొప్పులు రావడంతో నర్సులు గైనకాలజిస్ట్ మానసారెడ్డికి ఫోన్ చేశారు. ఫోన్‌లోనే డాక్టర్ సలహాలివ్వగా.. నర్సులు ఆపరేషన్ కానిచ్చారు. దాంతో పుట్టిన మగశిశువు మరునాడు చనిపోయింది. బాధితుల ఫిర్యాదుతో డాక్టర్, నర్సులపై పోలీసులు కేసు నమోదుచేశారు.

Blog Image

ప్రధానిని వెనక్కి నెట్టిన పవన్ కల్యాణ్

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో..పవన్ కల్యాణ్ సోషల్ మీడియా అకౌంట్ మోస్ట్ పాపులర్ పొలిటికల్ అకౌంట్‌గా నిలిచింది. 2వ స్థానంలో ప్రధాని మోదీ, 3వ స్థానంలో రాహుల్ గాంధీ, 4వ స్థానంలో సీఎం జగన్, 7వ స్థానంలో కేటీఆర్ ఉన్నారు.

Blog Image

‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత

‘నేచురల్స్ ఐస్‌క్రీమ్’ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్(70) కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్‌ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను స్థాపించి ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ.400 కోట్లు.

Blog Image

ఉద్యోగులకు 'కాగ్నిజెంట్' వార్నింగ్

ప్రముఖ టెక్ దిగ్గడం కాగ్నిజెంట్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకొచ్చి పనిచేయాలని ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఈఓ రవి కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కంపెనీలో మొత్తం 3.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా సుమారు 2.54 లక్షల మంది భారత్‌లోనే పనిచేస్తున్నట్లు సమాచారం.

Blog Image

భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్‌

AP: శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తుల రద్దీ పెరగడంతో టోల్‌గేట్‌ మలుపు వద్ద ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. పెద్ద ఎత్తున వచ్చిన వాహనాలు శివపార్వతుల విగ్రహాల వద్ద నిలిపివేయడంతో ఆలయానికి వచ్చి తిరిగి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Blog Image

మారనున్న రణబీర్‌-సాయి పల్లవి ‘రామాయణం’ టైటిల్‌

రణబీర్‌ కపూర్, సాయి పల్లవి జంటగా నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ టైటిల్‌ మారబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. లీగల్‌ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మరో వర్కింగ్ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు బీటౌన్ నుంచి వార్తలొస్తున్నాయి. ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ప్రస్తుతం దానిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Blog Image

సభలో గందరగోళం... మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్‌, అఖిలేష్‌

ఉత్తరప్రదేశ్‌లోని ఒక బహిరంగ సభలో తొక్కిసలాట పరిస్థితులు తలెత్తడంతో మీటింగ్‌ మధ్య నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ వెళ్లిపోయారు. సభా వేదికను చేరుకోవడానికి ఇటు ఎస్పీ, అటు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో భద్రతాపరమైన సమస్యలు వస్తాయని రాహుల్, అఖిలేష్‌లను పోలీసులు హెచ్చరించడంతో వారు ప్రసంగించకుండా మధ్యలోనే వెనుదిరిగారు.

Blog Image

స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ అసహనం

స్టార్ స్పోర్ట్స్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ అసహనం వ్యక్తం చేశారు. తాను గోప్యంగా మాట్లాడుతున్న మాటలను రికార్డ్ చేయొద్దని కోరినప్పటికీ, రికార్డ్ చేశారని మండిపడ్డారు. రికార్డ్ చేయడమే కాదు దాన్ని టెలికాస్ట్ కూడా చేశారన్నారు. ఇలా కంటెంట్ మీద దృష్టి పెట్టి ప్రతీది టెలికాస్ట్ చేస్తే..క్రికెటర్లు, క్రికెట్, అభిమానుల మధ్య ఉన్న బంధం విచ్చిన్నమవుతుందన్నారు. ఉన్న మంచి భావాన్ని అలానే ఉంచుకోవాలని సూచించారు.

Blog Image

బ్రిటన్ రాజు కంటే రిషిసునాక్ దంపతుల సంపద ఎక్కువ!

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు బ్రిటన్ రాజు చార్లెస్‌ III కంటే ఎక్కువని సండే టైమ్స్ నివేదిక తెలిపింది. కింగ్‌ చార్లెస్‌ సంపద గత ఏడాది కాలంలో 600 మిలియన్‌ పౌండ్ల నుంచి 610 మిలియన్‌ పౌండ్లకు చేరుకుంది. సునాక్‌ దంపతుల సంపద మాత్రం 529 మిలియన్‌ పౌండ్ల నుంచి 651 మిలియన్‌ పౌండ్లకు పెరిగింది.

Blog Image

ఈ ఏడాది వర్షాలు ఎక్కువే: ఐఎండీ

భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ సీజన్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని తెలిపింది. లానినా కారణంగా ఏర్పడిన పరిస్థితులతో పసిఫిక్ మహా సముద్రం చల్లబడటం వల్ల ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని వివరించింది. భారత వ్యవసాయ రంగం రుతుపవనాలపై ఆధారపడి ఉంది. రుతుపవనాల ప్రభావం దేశ ఆహార రంగంపై కూడా ప్రభావం చూపుతాయి.

Blog Image

‘పుష్ప-2’ కోసం హైదరాబాద్‌లో మలేషియా సెట్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప-2’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..ఓ కీలక సన్నివేశం కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మలేషియా సెట్ వేసినట్లు సమాచారం. కాగా ఇటీవల విడుదలైన ‘పుష్ప-పుష్ప’ సాంగ్ మూవీపై అంచనాలను పెంచిన విషయం తెలిసిందే.

Blog Image

కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి: ఈసీ ఆదేశాలు

TG: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఈసీ మెమో జారీచేసింది. పోలింగ్ రోజున కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ తెచ్చిన పార్టీకి. తెలంగాణ సాధించిన నేతకు ఓటు వేశాను. మీరందరూ కూడా ఓటువేయాలి’’ అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత జి. నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈసీ చర్యలు చేపట్టింది.

Blog Image

ధోనీపై కమల్‌ ప్రశంసలు

హీరోలు క్రికెటర్ల గురించి మాట్లాడినా.. క్రికెటర్లు- హీరోలు ఏదైనా వేదికపై కలిసినా సినీ, క్రీడా అభిమానులకు అదో ఆనందం. తాజాగా ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ తన కొత్త సినిమా భారతీయుడు- 2 ప్రచారంలో భాగంగా ‘స్టార్స్‌ స్పోర్ట్స్‌’ ఛానల్‌కు వెళ్లి.. సినిమా సంగతులు పంచుకున్నారు. తన అభిమాన క్రికెటర్‌ ఎం.ఎస్‌. ధోనీని కొనియాడారు. అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

Blog Image

రాహుల్, మమతపై విరుచుకుపడిన మోదీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో వీరిపై విమర్శలు గుప్పించారు. రాహుల్‌ను ఉద్దేశిస్తూ..షెహజాదా మావోయిస్టు భాష వాడటం వల్ల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ పారిశ్రామికవేత్త అయిన పెట్టుబడులు పెట్టేందుకు 50సార్లు ఆలోచిస్తారన్నారు.ఒక వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి మమత సామాజిక, మత సంస్థలను బెదిరిస్తోందని ఆరోపించారు.

Blog Image

ఎమ్మెల్యేల సవాళ్ల పర్వం

తెలంగాణలో రాజకీయాలు కాస్త హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ల మధ్య భూమి విషయమై సవాళ్ల పర్వం మొదలైంది. మేడ్చల్‌లోని సుచిత్రా ల్యాండ్ తనది కాదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే లక్ష్మణ్ రాజీనామా చేయాలని మల్లారెడ్డి ఛాలెంజ్ చేశారు. దీనిపై లక్ష్మణ్‌ స్పందిస్తూ.. సవాల్‌ను స్వీకరిస్తున్నానని, రాజీనామా ఎవరు చేస్తామో చూద్దామని వ్యాఖ్యానించారు.

Blog Image

వ్యవసాయంలో అంకురాలు దూసుకెళ్తున్నాయ్‌..!

అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు వల్ల తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య 7000కు పైగా పెరిగాయని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) అధ్యక్షుడు జవారె గౌడ వెల్లడించారు. తొమ్మిదేళ్లలో వ్యవసాయరంగ కేటాయింపులు రూ.30వేల కోట్ల నుంచి రూ.1.3లక్షల కోట్లకు చేరగా.. 4% వృద్ధిని సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు ఆర్థిక మద్దతు అందించినట్లు తెలిపారు.

Blog Image

తాడిపత్రిలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

AP: ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక దాడులపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాడిపత్రిలో నమోదైన 7 కేసుల వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో ఘర్షణలు జరిగిన ప్రాంతాలను సిట్ బృందం పరిశీలించింది. దీనిపై త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించనుంది.

Blog Image

ముత్యాలమ్మ అమ్మవారి ఫోటో వైరల్

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైన ముత్యాలమ్మ ఆలయంలో తీసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఓ భక్తుడు ఫోటో తీయగా అందులో అమ్మవారి కుడి చేతి నుంచి వెలుగు వచ్చినట్లు కనిపించింది. దీంతో పలువురు ఆ వెలుగును అమ్మవారి మహిమగా భావిస్తూ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

Blog Image

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి రెండే కారణాలు: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో కేటీఆర్ మాట్లాడుతూ.. రెండు కారణాల చేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. క్షేత్రస్థాయి వరకు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం తొలి తప్పని పేర్కొన్నారు. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం రెండో తప్పని అన్నారు.

Blog Image

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

AP: నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకాయి. ఈ నెల 31నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ మొదటి వారంలో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. ఈ నెల 24 నాటికి వాయు గుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. దీని వల్ల కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Blog Image

TSPSC కొత్త పేరు ఇదేనా!

తెలంగాణ స్టేట్‌లో ఇప్పటివరకు వాడుతున్న టీఎస్(TS) పేరును టీజీ(TG)గా మార్చాలంటూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యాలయాల నేమ్ బోర్డులపై TSకి బదులుగా.. TG అని రాయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ సంస్థలు టీఎస్‌కు బదులుగా టీజీని రాస్తున్నాయి. అయితే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేరును కూడా TGPSCగా మార్చనున్నారని తెలుస్తోంది.