shape

Business ChotaNews

25 అడుగుల లోతులో పడిన బస్సు.. ఇద్దరు మృతి

25 అడుగుల లోతులో పడిన బస్సు.. ఇద్దరు మృతి

గుజరాత్‌లో ప్రయాణికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ బస్సు నదియాడ్‌లోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై 25 అడుగుల ఎత్తులో రోడ్డుపై రెయిలింగ్ నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. బస్సు అహ్మదాబాద్‌ నుంచి పూణె వెళ్తున్నట్లు సమాచారం. సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని ఎడమవైపు తిప్పడంతో బస్సు ఢీకొట్టింది. ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

రుణ గ్రహీతల పూర్వ ధ్రువీకరణకు పోర్టల్‌

రుణ గ్రహీతల పూర్వ ధ్రువీకరణకు పోర్టల్‌

రుణాలు కోరుకునే వారికి సంబంధించి పూర్వపు ధ్రువీకరణ వివరాలతో ఒక పోర్టల్‌ను సెంట్రల్‌ ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (CEIB) ప్రారంభించింది. రుణాల మంజూరు విషయంలో బ్యాంక్‌లు సకాలంలో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా కావాల్సిన సమాచారాన్ని ఇది అందిస్తుందని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. SBI సహకారంతో CEIB రూపొందించిన పోర్టల్‌ ఇప్పుడు బ్యాంక్‌ల పని సులభతరం చేయనుంది.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

టీడీపీ-జనసేన మొదటి జాబితాలో పేర్లు ఇవే?

టీడీపీ-జనసేన మొదటి జాబితాలో పేర్లు ఇవే?

ఏపీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన నేడు అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేయనుంది. ఈ జాబితాలో పెద్దాపురం- చినరాజప్ప, మండపేట- జోగేశ్వరరావు, పాలకొల్లు- నిమ్మల రామానాయుడు, ఆమదాలవలస- కూన రవికుమార్, ఉండి- మంతెన రామరాజు, మంగళగిరి-లోకేశ్ , కుప్పం- చంద్రబాబు, టెక్కలి- అచ్చెన్నాయుడు, విశాఖపట్నం ఈస్ట్‌- వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్‌- గణబాబు, విజయవాడ ఈస్ట్‌- గద్దె రామ్మోహన్ పేర్లు ఉంటాయని తెలుస్తోంది.

నేడు సీఎంతో ధరణి కమిటీ భేటీ

నేడు సీఎంతో ధరణి కమిటీ భేటీ

HYD : ధరణి పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలను నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (NIC)కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకోసం శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి, ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్, దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సమావేశమై పలు కీలకనిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి24.02.2024

దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి24.02.2024

దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి24.02.2024

515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులు

515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులు

AP : రాష్ట్రవ్యాప్తంగా 515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. 15రోజుల్లో ఈ బోర్డుల ఏర్పాటుకు దేవదాయశాఖ కసరత్తు చేస్తోంది. దేవదాయశాఖ పరిధిలో ఏడాదికి రూ. 5లక్షలు, అంతకు పైబడి ఆదాయం ఉండే ఆలయాలు 1,234వరకు ఉన్నాయి. వీటిలో ట్రస్టు బోర్డుల నియామకానికి ఎలాంటి పాలన పరమైన, న్యాయపరమైన చిక్కులు లేని 515 ఆలయాలకు నూతన ట్రస్టు బోర్డులను నియమిస్తున్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 62,880 మంది స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 21,904 మంది తమ తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు అందించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.03 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.

నగర రైల్వే స్టేషన్లకు అమృతకాలం

నగర రైల్వే స్టేషన్లకు అమృతకాలం

HYD : అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద నగరంలోని పలు రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. మల్కాజిగిరి, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్‌, మలక్‌పేట్‌, ఉప్పుగూడ, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో పనులు ప్రారంభమయ్యాయి. బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి రూ.26.55కోట్లు కేటాయించినట్టు సికింద్రాబాద్‌ డివిజన్‌ డిప్యూటీ కమర్షియల్‌ మేనేజర్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు. సుమారు రోజూ 16,648మంది వచ్చిపోయే ఈస్టేషన్‌కు విమానాశ్రయ స్థాయి సౌకర్యాలు కల్పించాలని ద.మ. రైల్వే నిర్ణయించింది.

నేడు బీజేపీ సీఈసీ భేటీ.. సీట్లపై స్పష్టత వచ్చేనా?

నేడు బీజేపీ సీఈసీ భేటీ.. సీట్లపై స్పష్టత వచ్చేనా?

ఢిల్లీలో నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటీ జరగనుంది. ఈ భేటీ తర్వాత తెలంగాణలో సగం లోక్‌సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నష్టం జరిగిందన్న వాదనల నేపథ్యంలో ఇప్పుడు 17 ఎంపీ స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఆస్తిపన్ను లెక్క తేల్చాలని GHMC నిర్ణయం

ఆస్తిపన్ను లెక్క తేల్చాలని GHMC నిర్ణయం

HYD : ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు GHMC సిద్ధమైంది. పన్ను బకాయిదారులకు డిమాండ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. భవనానికి, భవన యజమాని చెల్లిస్తోన్న పన్నుకు వ్యత్యాసం ఉన్నట్లయితే.. ఆయా నిర్మాణాలకు నోటీసు వెళ్తుందని, కొలతలు తీసుకుని పన్ను వ్యత్యాసాన్ని సరిచేస్తామని GHMC అధికారులు ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో స్పష్టం చేశారు.

నేడు టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా?

నేడు టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా?

టీడీపీ, జనసేనల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానుంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు. తొలి జాబితాలో టీడీపీ నుంచి ఒక 50 పేర్లను.. జనసేన నుంచి 15 పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

57 అమృత్‌ భారత్‌ స్టేషన్లకు 26న శంకుస్థాపన

57 అమృత్‌ భారత్‌ స్టేషన్లకు 26న శంకుస్థాపన

HYD : దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 57 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లకు రూ.230కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 34 స్టేషన్లకు రూ.613కోట్లు అదే విధంగా మహారాష్ట్రలో 6 స్టేషన్లకు రూ.63కోట్లు, కర్ణాటకలో 2 స్టేషన్లకు రూ.18.5కోట్లు ఖర్చుచేసి ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచనున్నారు.

తిరుమలలో నేడు పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో నేడు పౌర్ణమి గరుడసేవ

AP: తిరుమలలో నేడు(శనివారం) పౌర్ణమి గరుడసేవ జరగనుంది. ప్రతి నెలా పౌర్ణమిరోజున శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో గరుడసేవను టీటీడీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడునిపై కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వివాదాలకు తావులేకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాలు

వివాదాలకు తావులేకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాలు

AP: వివాదాలకు తావులేకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, తొలగింపు పారదర్శకంగా జరగాలన్నారు.

చేవెళ్ల నుంచే పథకం ప్రారంభం?

చేవెళ్ల నుంచే పథకం ప్రారంభం?

TG : మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవనున్నట్లు సమాచారం. 27న సాయంత్రం బహిరంగ సభ జరిగే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

నామినేషన్ డిపాజిట్@రూ.25 వేలు

నామినేషన్ డిపాజిట్@రూ.25 వేలు

లోక్‌సభకు త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో అభ్యర్థుల వ్యయపరిమితిని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఖరారు చేసింది. ఒక్కోఅభ్యర్థి గరిష్ఠంగా రూ.95 లక్షలు ఖర్చు చేయవచ్చని తెలిపింది. ప్రచారంలో రాజకీయ పార్టీలకు అనుమతి ఇచ్చే వాహనాల సంఖ్యను 5 నుంచి 14కు పెంచింది. నామినేషన్‌ దాఖలుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500, ఇతర అభ్యర్థులు రూ.25 వేల చొప్పున డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

మంగళగిరి ఎయిమ్స్‌లో క్యాన్సర్‌కు చికిత్స : CEO

మంగళగిరి ఎయిమ్స్‌లో క్యాన్సర్‌కు చికిత్స : CEO

AP : క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌‌లో అందుబాటులో ఉన్నాయని, ఇతర అరుదైన వ్యాధులకూ వైద్యం అందిస్తున్నామని ఎయిమ్స్‌ డైరెక్టర్‌, CEO డాక్టర్‌ మాదబానంద్‌కర్‌ వెల్లడించారు. ఈ నెల 25న ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులకు శంకుస్థాపన చేస్తారన్నారు.

నేడు అమ్మవార్ల వన ప్రవేశం

నేడు అమ్మవార్ల వన ప్రవేశం

TG: మేడారం సమ్మక్క- సారలమ్మల జాతర తుదిఘట్టానికి చేరింది. నేడు(శనివారం) సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లనున్నారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజారులు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. శనివారం పౌర్ణమి కావడం…జాతర తుదిఘట్టానికి చేరనుండడంతో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని అంచనావేస్తున్నారు.

కోటి ఉంటేనే కోరుకున్న ఇల్లు

కోటి ఉంటేనే కోరుకున్న ఇల్లు

HYD: నగరంలో ఖరీదైన ఇళ్లవిక్రయాల జోరు కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాలవాటా 2023లో 8% ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14%కి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే కారణమని మార్కెట్‌వర్గాలు అంటున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీలో రెండు పడకగదుల ఫ్లాట్‌ కొనుగోలు చేయాలంటే కోటిరూపాయలు ఉండాల్సిందే.

గ్యాస్‌ రాయితీ..నగదు బదిలీనే

గ్యాస్‌ రాయితీ..నగదు బదిలీనే

HYD: గ్యాస్‌ రాయితీ లబ్ధిదారులకు ‘నగదు బదిలీ’ విధానాన్నే అమలు చేయాలని పౌరసరఫరాలశాఖ తాజాగా నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకునేటప్పుడు మొత్తంధర చెల్లించాలి. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.955గా ఉంది. మహాలక్ష్మి పథకంలో అర్హులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకుఖాతాలో బదిలీ చేయాలని నిర్ణయించింది.

లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు

లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు

పార్లమెంటు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బలమైన అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్‌ కసరత్తు ముమ్మరం చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం హైదరాబాద్‌ వస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడి రిసెప్షన్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపా దాస్‌మున్షీ తదితరులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సీఎం 66 కిలోలు.. గవర్నర్‌ 60

సీఎం 66 కిలోలు.. గవర్నర్‌ 60

మేడారం సమ్మక్క సారలమ్మలకు సీఎం రేవంత్‌రెడ్డి తన బరువంత బెల్లం (బంగారం) సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆయన తులాభారంలో 66 కిలోలు తూగారు. దీనికి సరిపడా బెల్లం కొనుగోలుకు అయ్యే డబ్బును సంబంధిత అధికారులు ఆలయ సిబ్బందికి చెల్లించారు. అంతకుముందు అమ్మలను దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై 60 కిలోలు తూగగా.. సంబంధిత అధికారులు దానికి సరిపడా బెల్లం కోసం డబ్బు చెల్లించారు.

‘TG’పై నేడో, రేపో నోటిఫికేషన్‌

‘TG’పై నేడో, రేపో నోటిఫికేషన్‌

TG: కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ మారనుంది. ప్రస్తుతం ‘టీఎస్‌’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేస్తుండగా ఇక ‘టీజీ’గా మారనుంది. ఈ మేరకు కేంద్రం నేడో, రేపో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీచేస్తుంది. అనంతరం కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం టీఎస్‌ కోడ్‌ను టీజీగా మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

TG: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి.

సముద్రంలో సరస్సు.. ముట్టుకుంటే చావు తప్పదా?

సముద్రంలో సరస్సు.. ముట్టుకుంటే చావు తప్పదా?

రెడ్ సీలో ఓ లేక్ ఉంది. అందులోకి ఏ జంతువు వెళ్లినా మరణిస్తుంది. దానికి అసలు కారణమేంటో తెలుసుకోవటానికి పై వీడియోను చూడండి.

విద్యార్థులకు సీసీఎల్‌ మ్యాచ్‌లు ఉచితం: హెచ్‌సీఏ

విద్యార్థులకు సీసీఎల్‌ మ్యాచ్‌లు ఉచితం: హెచ్‌సీఏ

సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌(సీసీఎల్‌)కు ఆతిథ్యమిచ్చేందుకు ఉప్పల్‌ స్టేడియం ముస్తాబవుతోందని హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌‌రావు వెల్లడించారు. ఈ మ్యాచ్‌లకు ప్రతి రోజు 10 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని వెల్లడించారు. ఈ లీగ్‌ ఫస్ట్‌‌ఫేజ్ పోటీలు షార్జాలో జరుగుతుండగా.. వచ్చే నెల 1 నుంచి 3 వరకు సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ వేదిక కానుంది.

‘మా సినిమాకు చిన్న పిల్లలు రావొద్దు’

‘మా సినిమాకు చిన్న పిల్లలు రావొద్దు’

అనన్య నాగళ్ల ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘తంత్ర’. శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకుడు. నరేష్‌బాబు, రవి చైతన్య నిర్మాతలు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. మూవీని చూసిన సెన్సార్ బోర్డు.. ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చిందట. దీంతో తమ సినిమాకు చిన్న పిల్లలు రావొద్దంటూ.. స్వయంగా మూవీటీం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

భార్య పేరుపై ఉన్నా అది కుటుంబ ఆస్తే: హైకోర్టు

భార్య పేరుపై ఉన్నా అది కుటుంబ ఆస్తే: హైకోర్టు

స్వతంత్రంగా ఆదాయ వనరులులేని, గృహిణి పేరుతో భర్తలు కొన్న ఆస్తిని కుటుంబ ఆస్తిగానే పరిగణించాలని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. హిందూ భర్తలు తమ భార్యల పేరుతో ఆస్తులు కొనటం సర్వసాధారణమని తెలిపింది. మరణించిన తన తండ్రి ఆస్తికి సహ యాజమాన్యాన్ని ప్రకటించాలని ఓ కొడుకు వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఈ తీర్పు ఇచ్చింది.

బెన్‌స్టోక్స్‌ వ్యాఖ్యలకు సునీల్‌ గావస్కర్‌ కౌంటర్!

బెన్‌స్టోక్స్‌ వ్యాఖ్యలకు సునీల్‌ గావస్కర్‌ కౌంటర్!

భారత్‌తో మూడో టెస్టు ఓటమి తర్వాత ‘అంపైర్స్‌ కాల్’పై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్ కీలకవ్యాఖ్యలు చేశాడు.‘‘డకెట్‌ విషయంలోనే చూడండి. అది ‘అంపైర్స్ కాల్’. కానీ బంతి స్టంప్స్ తాకడంతోనే బెన్‌ ‘గుడ్‌బై’ అంటూ వెళ్లిపోవాలి కదా. అంపైర్స్‌ కాల్‌ కావడం వల్ల లైఫ్‌ దొరికింది. ఒకవేళ అదే వ్యతిరేకంగా నిర్ణయం ఇచ్చి ఉంటే డీఆర్‌ఎస్‌లోనూ ఔట్‌గా తేలేది’’ అని చెప్పుకొచ్చాడు.

సోనూసూద్‌ ఫుడ్ బిల్లు కట్టిన అభిమాని

సోనూసూద్‌ ఫుడ్ బిల్లు కట్టిన అభిమాని

లాక్‌డౌన్‌ సమయంలో సేవా కార్యక్రమాల ద్వారా అందరి మన్ననలు అందుకున్న నటుడు సోనూసూద్‌. సేవాగుణంతో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఓ అజ్ఞాత అభిమాని సోనూసూద్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇటీవల సోనూసూద్‌ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. భోజనానంతరం బిల్లు కోసం సిబ్బందిని అడగగా… మొత్తం బిల్లును ఎవరో అజ్ఞాత వ్యక్తి చెల్లించి వెళ్లాడని చెప్పారు.