shape

Telangana ChotaNews

Blog Image

మాజీ మంత్రి అనిల్‌పై ఫిర్యాదు

AP: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కౌసర్‌ జాన్‌ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల్లూరు పట్టణం భగత్‌సింగ్‌ కాలనీలోని తన స్థలంలో వైసీపీ ఆఫీసు కడుతున్నారని ఫిర్యాదు చేశారు. 2002లో తన భర్త కొన్న స్థలంలో 2.8 ఎకరాలు ఆక్రమించారని.. తనకు న్యాయం చేయాలని ఏడాదిగా పోరాటం చేస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Blog Image

OTTలోకి మరో బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటించిన కామెడీ డ్రామా ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’. విపిన్‌ దాస్‌ దర్శకుడు. ఈ ఏడాది మే 16న కేరళలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్‌27న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Blog Image

‘జై పాలస్తీనా’ అనడం తప్పేలా అవుతుంది?: అసదుద్దీన్

ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అనడం వివాదాస్పదం అవుతోంది. దీనిపై అసదుద్దీన్ స్పందిస్తూ.. ‘‘ఇతర సభ్యులూ చాలా నినాదాలు చేశారు. అలాగే నేనూ జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అన్నాను. అది తప్పేలా అవుతుంది?. రాజ్యాంగంలోని నిబంధనలేంటో చెప్పండి. నేను చెప్పాలనుకుంది చెప్పాను. పాలస్తీనా గురించి మహాత్మాగాంధీ ఏమన్నారో చదవండి’’ అని చెప్పుకొచ్చారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

‘భారత్ జోడో’ నినాదాల మధ్య రాహుల్ ప్రమాణం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో రాయ్‌బరేలి ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఐదోసారి ఆయన లోక్‌సభలో ప్రమాణం చేశారు. రాహుల్ ప్రమాణం చూసేందుకు తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక పార్లమెంట్‌కు వచ్చారు. రాహుల్ ప్రమాణం చేస్తున్న సమయంలో జోడో.. జోడో.. భారత్ జోడో అని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. జై హింద్, జై సంవిధాన్ అంటూ రాహుల్ ప్రమాణం ముగించారు.

Blog Image

వైసీపీ కార్యాలయాలకు నో రూల్స్: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి

AP: రాష్ట్రవ్యాప్తంగా పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగా ఇంద్ర భవనాల్లాగా నిర్మించారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. అనుమతులు లేకపోవడంతోనే అధికారులు వాటిని కూల్చివేస్తున్నట్లు పులివెందుల ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీకేంద్ర కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అధికారులు అనేకసార్లు నోటీసులు ఇచ్చిన విషయాన్ని భూమిరెడ్డి గుర్తు చేశారు.

Blog Image

మంత్రి లోకేష్‌ను కలిసిన క్రికెటర్ హనుమ విహారి

AP: ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్‌తో పలు విషయాలపై చర్చించారు. తాను గతంలో రాజకీయాలకు బలయ్యానని వైసీపీ ప్రభుత్వం, ఏపీ క్రికెట్ అసోసియేషన్ నాపై ఒత్తిడి చేసి కెప్టెన్‌గా రాజీనామా చేయమన్నారని తెలిపారు. మంత్రి లోకేష్ తనను తిరిగి ఏపీకి రావాలని ఆహ్వానించడంతో మళ్ళీ వచ్చానని తెలిపారు.

Blog Image

ప్రధాని మోదీపై ఖర్గే ఫైర్

దేశంలోని సమస్యలపై స్పందించకుండా ప్రధాని మోదీ అహంకారం చూపుతున్నారని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. NEET అవకతవకలు, ట్రైన్ యాక్సిడెంట్లు, మణిపుర్ అల్లర్లు, అస్సాం వరదలు, రూపాయి విలువ తగ్గడాన్ని ప్రధాని పట్టించుకోరని ఆయన విమర్శించారు. నైతికంగా ప్రజలు ఓడించినా మోదీకి అహంకారం తగ్గలేదని ఎద్దేవ చేశారు.

Blog Image

రాజ్యాంగం పట్టుకొని మల్లు రవి ప్రమాణం

లోక్‌సభ సభ్యుడిగా మల్లు రవి ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి ఆయన నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఈ సందర్భంగా రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ప్రమాణం చేశారు. తెలుగులో ప్రమాణం చేసిన ఆయన జై తెలంగాణ, జై భీం అని నినాదం చేశారు.

Blog Image

చౌక దుకాణాల ద్వారా రేషన్‌ పంపిణీ: మంత్రి

AP: గిరిజన ప్రాంతాల్లో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీకి స్వస్తి పలికామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇక నుంచి చౌక దుకాణాల ద్వారా మాత్రమే రేషన్‌ పంపిణీ చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో 960 చౌక దుకాణాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన వసతిగృహాల్లో ఏఎన్‌ఎంలను నియమిస్తామన్నారు. ఫీడర్‌ అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు మళ్లీ తెస్తామన్నారు.

Blog Image

జగన్‌కు ఆ అర్హత లేదు: మంత్రి సంధ్యారాణి

AP: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడికి మాజీసీఎం జగన్ లేఖపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి కౌంటర్ ఇచ్చారు. 11సీట్లు వచ్చిన జగన్ ప్రతిపక్ష హోదాను ఎలా అడుగుతారు..? అని ప్రశ్నించారు. అసలు సభ అంటే జగన్‌కు గౌరవం ఉందా..? అని నిలదీశారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ లేరన్నారు. తాము పిలిచినా స్పీకరుకు జగన్‌ కనీసం గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు.

Blog Image

ఐఓఎస్‌ 18 డెవలపర్‌ బీటా 2 వెర్షన్‌ విడుదల

యాపిల్‌ ఐఓఎస్‌ 18 డెవలపర్‌ బీటా 2 వెర్షన్‌ను విడుదలచేసింది. ఆ తర్వాత తరం ఐఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను జూన్‌ 10న తొలిసారి ‘వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌’లో పరిచయం చేసింది. నమోదిత డెవలపర్లకు కొత్త ఫీచర్లతో బీటా-1ను విడుదల చేసింది. యాప్‌లు, ఫోల్డర్లను హోమ్‌స్క్రీన్‌లో కనపడకుండా ఉంచడం వంటి ఫీచర్లను ఉంచింది. తాజాగా మరిన్ని ఫీచర్లను జతచేసి కొత్త వెర్షన్‌ను రిలీజ్ చేసింది.

Blog Image

ర‌ష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’లో మరో బ్యూటీ!

రష్మిక మంద‌న్నా లీడ్‌ రోల్‌లో నటిస్తున్న మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రన్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇంతకీ ఈ బ్యూటీని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Blog Image

ప్రమాణస్వీకారం చేసిన బలరాం నాయక్

లోక్‌సభలో మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 2009లో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఆయన మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు.

Blog Image

‘స్పీకర్‌ విషయంలో ప్రతిపక్షాల తీరు ఆక్షేపణీయం’

లోక్‌సభ స్పీకర్ పదవికి ప్రతిపక్షం పోటీ సృష్టించడం మంచి సంప్రదాయం కాదని.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆక్షేపించారు. స్పీకర్ విషయంలో కేంద్ర పెద్దలు చేసిన ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించలేదు. దీంతో లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరపాలంటూ ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది.

Blog Image

సీఎంను కలిసిన రేణుకాస్వామి తల్లిదండ్రులు..

కన్నడ సినీనటుడు దర్శన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితుడు రేణుకాస్వామి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ కోడలు, రేణుకాస్వామి భ్యార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కాగా పవిత్ర గౌడాపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడనే నెపంతో హత్యా ఆరోపణలతో దర్శన్ అరెస్టయిన విషయం తెలిసిందే..

Blog Image

‘డబుల్ ఇస్మార్ట్‌’ నుండి క్రేజీ అప్‌డేట్!

పూరీ జగన్నాథ్-రామ్‌ పోతినేని కాంబోలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్‌’. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక మేకర్స్ చాలా రోజుల తర్వాత క్రేజీ అప్‌డేట్ అందించారు. ఈ సారి మాస్‌ మ్యూజిక్‌ జాతర ఉండబోతుంది.. వేచి ఉండండి.. అంటూ డబుల్‌ ఇస్మార్ట్‌ గెటప్‌లో స్టైలిష్‌గా నడుచుకుంటూ వెళ్తున్న రామ్‌ లుక్‌ను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.

Blog Image

హంద్రీనీవా కాల్వపనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు

AP: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. శాంతిపురం మండలం జెల్లిగానిపల్లె వెళ్లిన చంద్రబాబు… అర్థాంతరంగా నిలిచిపోయిన హంద్రీనీవా కాల్వ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే కాల్వ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కుప్పం నియోజకవర్గంలో మంగళవారం, బుధవారం సీఎం పర్యటన కొనసాగనుంది.

Blog Image

లోక్‌సభలో తెలంగాణ యువ ఎంపీల ప్రమాణం

తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున యువ ఎంపీలుగా కుందూరు రఘువీర్ రెడ్డి, కడియం కావ్య తొలిసారి లోక్‌సభలో అడుగు పెట్టారు. నల్గొండ ఎంపీగా రఘువీర్, వరంగల్ ఎంపీగా కావ్య తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణం తర్వాత జై తెలంగాణ, జై భద్రకాళి అని కావ్య అన్నారు.

Blog Image

వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఢిల్లీలోని త్యాగరాజ మార్గ్‌లో ఉన్న ఆయన నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. తాము ఇరువురూ జాతీయ ప్రాధాన్యత అంశాలపై చర్చించామని, మోదీ నాయకత్వంలో దేశం మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Blog Image

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా మరో బైక్

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు వివిధ కంపెనీలు ఆతరహా మోడళ్లను తీసుకొస్తున్నాయి. ట్రయంఫ్‌, హార్లే డేవిడ్‌ సన్‌ వంటి విదేశీ కంపెనీలతో బజాజ్‌, హీరో మోటోకార్ప్ జట్టు కట్టాయి. ఇప్పుడు మరో విదేశీ కంపెనీ భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. బ్రిటీష్‌ కంపెనీ క్లాసిక్‌ లెజెండ్స్‌ బీఎస్‌ఏ గోల్డ్‌ స్టార్‌ పేరుతో కొత్త మోటార్‌ సైకిల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

Blog Image

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇటీవలికాలంలో విద్యార్థుల ట్రాన్స్‌పోర్టేషన్‌కు సంబంధించి ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాలో పిల్లలను తీసుకొచ్చే అన్ని పాఠశాల బస్సులు, పూల్ కార్లలో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు, పానిక్ బటన్లు, వేగాన్ని నియంత్రించే పరికరాలను అమర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ వాహనాలు గరిష్టంగా 40 కిమీ వేగంతో వెళ్లొచ్చని తెలిపింది.

Blog Image

‘ఆయ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో నితిన్ నార్నె న‌టిస్తున్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాను అంజి కె.మ‌ణిపుత్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ తాజాగా వెల్ల‌డించారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 15న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఆయ్’ సినిమాలో న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా రామ్ మిర్యాల సంగీతాన్ని అందిస్తున్నారు.

Blog Image

రష్యా పర్యటనకు మోదీ

భారత ప్రధానిగా మూడోసారి ఎన్నికైన మోదీ జులైలో రష్యా పర్యటనకు వెళ్లనున్ననట్లు తెలుస్తోంది. భారత్‌-రష్యా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుంది. అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వర్గాలను ఉటంకిస్తూ రష్యా అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. మోదీ పర్యటన విషయంలో రష్యా నుంచి బహిరంగ ఆహ్వానం ఉందని, పుతిన్‌తో ఆయన సమావేశం ఉంటుందని మార్చి నెలలో క్రెమ్లిన్‌ వెల్లడించింది.

Blog Image

ఎంపీగా ప్రమాణం చేసిన చామల

భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. తెలుగు బాషలో దైవ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి అని అన్నారు.

Blog Image

తగ్గనున్న సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరలు..

రష్యా-ఉక్రెయిన్‌ పోరాటం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కీ విస్తరించింది. ఈ రెండు దేశాలు తమ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నిల్వలను వదిలించుకునేందుకు పోటీ పడి ధరలు తగ్గించాయి. ధర తగ్గడంతో భారత కంపెనీలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లో లీటర్‌ సన్‌ఫ్లవర్‌ వంట నూనె రూ.110 నుంచి రూ.120 మధ్య పలుకుతోంది. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

Blog Image

కష్టమే కానీ.. అదరగొట్టారు: భారత కోచ్

ఆస్ట్రేలియాపై గెలిచి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకొన్న అక్షర్ పటేల్‌కు ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుదక్కింది. దీనిపై భారతకోచ్ దిలీప్ మాట్లాడుతూ.. ‘‘వెస్టిండీస్‌ పరిస్థితుల్లో ఫీల్డింగ్‌ చేయడం చాలాకష్టం. మన కుర్రాళ్లు మాత్రం అదరగొట్టారు. క్యాచ్‌లు అందుకోవడానికి శాయశక్తులా కష్టపడుతున్నారు. నిబద్ధతతో ఫీల్డింగ్ చేయడం అభినందనీయం. అక్షర్ అందుకున్న మ్యాచ్ మలుపుతిప్పింది’’ అని చెప్పుకొచ్చాడు.

Blog Image

అసదుద్దీన్ ఒవైసీకి చేదు అనుభవం

TG: అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పేరును ప్రొటెం స్పీకర్ పిలవగానే బీజేపీ ఎంపీలు జై శ్రీరామ్, వందేమాతరం నినాదాలు చేశారు. ఒవైసీ మాత్రం అవేమి పట్టించుకోకుండా ప్రమాణ స్వీకారం చేశారు. చివర్లో జై భీమ్, జై పాలస్తీనా అని ముగించారు.

Blog Image

అసదుద్దీన్ వ్యాఖ్యలతో సభలో గందరగోళం

లోక్‌సభలో ప్రమాణస్వీకారాల కార్యక్రమం సందర్భంగా కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అని అన్నారు. దీనిపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను రికార్డులో లేకుండా చూస్తామని ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ హామీ ఇవ్వడంతో అధికార పార్టీ ఎంపీలు శాంతించారు.

Blog Image

అంతర్జాతీయ క్రికెట్‌కు వార్నర్ గుడ్ బై

ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. T20 ప్రపంచకప్ తనకు చివరి టోర్నమెంట్ అని గతంలోనే వార్నర్ ప్రకటించాడు. నిన్న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ అతడికి చివరిది. తన చివరి వన్డే 2023 WC ఫైనల్లో భారత్‌పై, చివరి టెస్టు 2024 జనవరిలో పాక్‌పై ఆడాడు. వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 18,995 రన్స్ చేశాడు.

Blog Image

జులైలో 12రోజులు బ్యాంకు సెలవులా..?

ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. జులైలో ప్రాంతీయ, వారాంతపు సెలవులు, రెండు, నాలుగో శనివారాలు సహా 12 రోజులపాటు బ్యాంకులు మూత పడనున్నాయి. బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తూనే ఉంటాయి, కస్టమర్‌లు తక్షణ అవసరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు లేదా ATMల ద్వారా లావాదేవీలు కొనసాగించవచ్చు.