shape

National ChotaNews

Blog Image

ఆలయ నిర్మాణంలో డిజైన్ సమస్యలు లేవు: నృపేంద్ర మిశ్ర

అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు..ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర స్పందించారు. లీకేజీ నిజమేనని అంగీకరించిన ఆయన..దీనికి డిజైన్ సమస్యలు కారణం కాదని వెల్లడించారు. ‘‘మొదటి అంతస్తు నుంచి వర్షం నీరు కారడాన్ని చూశాను.శిఖర నిర్మాణం పూర్తయితే అది కవర్ అవుతుంది.’’అని వెల్లడించారు.

Blog Image

రాష్ట్రం జగన్ సొంత ‘జాగీరా’?: వర్ల రామయ్య

AP: అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వైసీపీని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ మొసలి కన్నీరు కార్చడం ఇకనైన ఆపాలని, రాష్ట్రం ఏమైనా జగన్ సొంత ‘జాగీరా’? అని ప్రశ్నించారు. 26జిల్లాలో వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం 2 ఎకరాల చొప్పున స్థలాలు అక్రమంగా కేటాయించారన్నారు.

Blog Image

చెప్పులతో దీక్షలో పవన్ కల్యాణ్

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన చెప్పులతో ఉన్నట్లు ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ

బుధవారం లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ ఉన్న నేపథ్యంలో తమ ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటల నుంచి సభ వాయిదా పడే వరకూ అందరూ లోక్‌సభలో ఉండాల్సిందిగా కాంగ్రెస్ చీఫ్ విప్ కే. సురేశ్ ఆదేశించారు. ఎన్డీఏ తరపున ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున కే.సురేశ్ స్పీకర్ పదవి కోసం పోటీ పడనున్నారు.

Blog Image

లోక్‌సభ రేపటికి వాయిదా

లోక్‌సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం అవుతుందని అన్నారు. కాగా, రేపు సభలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ స్థానం కోసం ఎన్డీయే తరుపున ఓం బిర్లా, ఇండియా బ్లాక్ తరుపున కే సురేష్ పోటీలో ఉన్నారు.

Blog Image

ప్రొటెం స్పీకర్ ఆసక్తికర కామెంట్

లోక్‌సభలో ప్రమాణస్వీకారాల కార్యక్రమం ముగిసింది. సభను వాయిదా వేసే ముందు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సభ్యులు ఇంకా ఎన్నికల మూడ్ నుంచి బయటకు రాలేదు. ప్రమాణస్వీకారాల సమయంలోనూ పోటాపోటీగా వాదనలకు దిగారు. సభ రికార్డుల్లో ప్రమాణాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు మాత్రమే ఉంటాయి. మిగితా వ్యాఖ్యలు, వీడియోలను బ్లర్ చేస్తాం’’ అని తెలిపారు.

Blog Image

హమాస్ చీఫ్‌కు భారీ షాక్

ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హనియే కుటుంబంలోని 10 మంది మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. అయితే, దీనిని ఇజ్రాయిల్ సైన్యం ఇంకా ధృవీకరించలేదు. మరోవైపు తాము గాజా కాల్పుల విరమణ, బందీల ఒప్పందానికి ఇజ్రాయిల్ కట్టుబడి ఉందని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు ప్రకటించడం గమనార్హం.

Blog Image

‘ఇందిరా గాంధీ’ హంతకుడి కుమారుడు ఎంపీగా ప్రమాణం...

మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బాడీగార్డుల్లో ఒకరైన బీంట్ సింగ్‌ కుమారుడు సరబ్‌జీత్‌ సింగ్‌ఖల్సా నేడు లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే ఆయన లోక్‌సభలో పంజాబీ భాషలోనే ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం ‘వహే గురూజీ కా ఖల్సా, వహే గురూజీ కీ ఫతేహ్‌ అని వ్యాఖ్యానించారు.

Blog Image

అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ట్రైలర్‌ వచ్చేసింది

అల్లు శిరీష్‌ హీరోగా సామ్‌ ఆంటోన్‌ రూపొందిస్తున్న సినిమా ‘బడ్డీ’. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ‘తగ్గేదే లే’ అంటూ టెడ్డీబేర్‌ చేసిన హంగామా, శిరీష్ యాక్షన్ అకట్టుకునేలా ఉన్నాయి.

Blog Image

అప్పటి నుంచే కన్నడ సాహిత్య సమ్మేళనాలు

డిసెంబరు 20, 21, 22 తేదీల్లో మాండ్యాలో 87వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కన్నడ సాహిత్య పరిషత్, మండ్య జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా యంత్రాంగంతో ప్రాథమిక సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాకు వివరించారు.

Blog Image

జార్ఖండ్‌ వ్యక్తి టీటీడీకి రూ.20లక్షల విరాళం..

AP: తిరుమలలోని వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నడిచే వివిధ కార్యక్రమాలకు ఓ భక్తుడు స్వామివారికి రూ. 20 లక్షలను విరాళంగా అందజేశాడు. జార్ఖండ్‌కు చెందిన సరళా ఇంజినీరింగ్ లిమిటెడ్ యజమాని ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ.10 లక్షలు , ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు అందించారు.

Blog Image

చివర్లో వైఎస్ అవినాశ్ ప్రమాణం

వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ ఎంపీలు సోమవారమే ప్రమాణం చేసినా నిన్న అవినాశ్ సభకు రాలేదు. దీంతో ప్రమాణస్వీకారాల కార్యక్రమం చివర్లో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం సభను బుధవారం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

Blog Image

ధనుష్‌ ‘రాయన్‌’ న్యూ లుక్!

హీరో ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న మూవీ ‘రాయన్‌’. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో జులై 26న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్‌ ఈ సినిమా నుండి కొత్త లుక్‌ విడుదల చేశారు. ఎస్‌జే సూర్య, ధనుష్‌ పోరుకు సై అంటోన్న స్టన్నింగ్‌ లుక్‌‌ను వదిలారు.

Blog Image

'అవును చేసింది నేనే'

నిజామాబాద్: జిల్లాకేంద్రంలోని హైమాధి బజార్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలాన్ని తప్పుడు పత్రాలు, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌తో అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించడం పట్ల కాంగ్రెస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సబ్ రిజిస్ట్రార్ బాదర్‌ను బిగ్‌టీవీ సంప్రదించగా తానే చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు రిజిస్ట్రార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Blog Image

ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ..

AP: వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్‌శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE) ఏసీబీకి రెడ్‌ హ్యెడెండ్‌గా పట్టుబడ్డాడు. నెల్లూరు జిల్లాలో శివశంకర్‌ అనే ఏఈ విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ కోసం రూ. 80 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో వినియోగదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా మంగళవారం వ్యూహం ప్రకారం పట్టుకున్నారు. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

Blog Image

ఏపీలో అత్యంత పురాతనమైన నిప్పు కోడి గూడు

పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆంధ్రప్రదేశ్‌లో 41,000 సంవత్సరాల నాటి నిప్పుకోడి గూడును కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని పేర్కొన్నారు. 1x1.5 మీటర్ల కాంపాక్ట్ ప్రాంతంలో సుమారు 3,500 ఉష్ట్రపక్షి గుడ్డు పెంకులు కనుగొనబడ్డాయని వెల్లడించారు. గతంలో దక్షిణ భారతదేశంలో ఉష్ట్రపక్షి ఉండేదని, దీనిద్వారా తేలిందని పేర్కొన్నారు.

Blog Image

పార్లమెంట్‌లో తెలుగు నటి ప్రమాణం

లోక్‌సభ సభ్యురాలిగా తెలుగు నటి రచనా బెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు. పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నియోజకవర్గం నుంచి ఆమె తృణముల్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారు. రాజకీయాల్లోకి అరంగేట్రంతోనే ఆమె విజయం సాధించారు. కాగా, తెలుగులో పలు హిట్ సినిమాల్లో రచన నటించి అందరికీ సుపరిచితురాలు అయ్యారు.

Blog Image

మంత్రులే ఆదాయపు పన్ను చెల్లించాలి!

మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మంత్రులు ఇకపై సొంతంగా ఆదాయపు పన్ను చెల్లించాల్సిందేనని సీఎం మోహన్‌ యాదవ్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తూ వస్తోంది. 1972 నుంచి ఈ నిబంధన అమల్లో ఉంది. దాదాపు 52 ఏళ్ల తర్వాత ఈ నిబంధనకు కేబినెట్‌ చరమగీతం పాడింది.

Blog Image

అమరావతి నిర్మాణానికి రూ.4.5 కోట్ల విరాళం

అమరావతి నిర్మాణానికి చిత్తూరు జిల్లా డ్వాక్రా మహిళలు రూ.4.5 కోట్ల విరాళం అందజేశారు. కుప్పం బహిరంగ సభలో సంబంధిత చెక్కును వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల ఉదారతను చంద్రబాబు అభినందించారు. అదే సభలో మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్టు తరఫున మరో రూ.కోటి విరాళంగా ఇచ్చారు.

Blog Image

వృద్ధుడిని కొరికి చంపేసిన సొరచేప..ఎక్కడంటే?

థాడియస్ కుబిన్‌స్కీ అనే వృద్ధుడు అమెరికాలోని ఫ్లోరిడాలోని బోకా సియేగా బే తీరానికి సమీపంలో నివసిస్తుంటాడు. ఇటీవలె ఆయన తన భార్యతో కలిసి సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఆసమయంలో అతడిపై ఓ సొరచేప అకస్మాత్తుగా దాడి చేసి, కొరకడంతో శరీరంలో కొంత భాగం ఊడొచ్చేసింది. దారుణం చూసి షాకైపోయిన భార్య వెంటనే సిబ్బందికి సమాచారం అందించింది. కానీ, భర్త అప్పటికే కన్నుమూశాడు

Blog Image

నితీష్‌కు శుభాకాంక్షలు తెలిపిన జగన్

జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లకు ఎంపికైన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘జింబాబ్వే పర్యటనకు వెళ్తున్న భారత క్రికెట్‌ జట్టులో విశాఖకు చెందిన ఆల్‌రౌండర్‌ నితీశ్‌ చోటు సంపాదించడంపై జగన్ అభినందనలు తెలియజేశారు. ఈ టూర్‌లో మంచి ప్రతిభ చూపాలని, కెరీర్లో మరింత ఎదగాలని ఆకాంక్షించారు’’ అని వైసీపీ Xలో పోస్ట్ చేసింది.

Blog Image

తన రికార్డులను తానే బ్రేక్‌ చేసిన ప్రభాస్‌

తన సినిమా రికార్డులను తానే బ్రేక్‌ చేశాడు హీరో ప్రభాస్‌. ‘సలార్‌’ రికార్డును ‘కల్కి’ మూవీ బ్రేక్ చేసింది. ప్రభాస్‌-నాగ్ అశ్విన్‌ కాంబోలో వస్తున్న ‘కల్కి’ జూన్‌ 27న రిలీజ్‌కానుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రం ప్రీ సేల్స్‌ ఓపెన్‌ చేయగా ‘సలార్‌’ ప్రీ సేల్‌ బుకింగ్స్‌ను ఒక్కరోజు ముందుగానే క్రాస్‌ చేసింది. ఇప్పటివరకు నార్త్‌ అమెరికాలోనే 1,25,000 టికెట్స్‌ అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.

Blog Image

కాంగ్రెస్‌లోకి జగన్.. పేర్ని క్లారిటీ

కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేస్తారనే ప్రచారంపై మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. ‘‘కాంగ్రెస్ పార్టీ జగన్‌ను 16 నెలలు జైలులో పెట్టింది. అలాంటి పార్టీలో ఎలా చేరుతారు. కావాలనే కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారు. మరోసారి ఎన్నికల్లో గెలిచే వరకు తాడేపల్లి నుంచే ప్రజల కోసం జగన్ పోరాటం చేస్తారు’’ అని అన్నారు.

Blog Image

బస్సును ఢీకొన్న ట్రక్కు

ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి కోఖ్‌రాజ్ ప్రాంతంలో బస్సును ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా.. ఆమె కుమార్తె గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని అల్కా (40), ఆమె కుమార్తెను సంధ్య(12)గా గుర్తించారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ నుంచి కాన్పూర్‌కు 40 మందితో బస్సు వెళ్తుండగా పంచమ్ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

Blog Image

పెళ్లిపై వస్తున్న రూమర్స్‌కు నివేదా క్లారిటీ..

నివేదా థామస్‌ ఇటీవలె తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఓ పోస్టుతో ఈ హీరోయిన్‌ పెళ్లి పీటలెక్కనుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ ‘చాలా రోజులు వేచి చూశారు. ఇది నా స్పెషల్‌ ఫిల్మ్‌’ అని కొత్త సినిమా విశేషాలు చెప్పారు. దీంతో ఆమె పెట్టిన స్టేటస్‌ పెళ్లి గురించి కాదని.. కొత్త సినిమా గురించేనని క్లారిటీ వచ్చింది.

Blog Image

ట్రూడోకు సొంత పార్టీలోనే వ్యతిరేకత

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్‌లో మౌనం పాటించి నివాళులర్పించడంపై అధికార పక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లిబరల్‌ పార్టీకి చెందిన ఎంపీ చంద్ర ఆర్య మాట్లాడుతూ.. ‘‘ జీవిత కాలం కెనడాకు సేవ చేసిన అతి కొద్ది మంది గొప్పవారికి ఇచ్చే అరుదైన గౌరవం అది. నిజ్జర్‌ ఆ కోవకు చెందిన వ్యక్తికాదు. అతడిని గౌరవనీయులైన కెనడా వాసుల సరసన చేర్చడం తప్పు’’అని పేర్కొన్నారు.

Blog Image

కత్రినా ప్రెగ్నెంట్‌.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ వస్తోన్న వార్తలపై ఆమె టీమ్‌ స్పందించింది. తాజాగా ఆమె ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. వదులుగా ఉండే దుస్తులు వేసుకొని కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ నెటిజన్లు మరోసారి పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ‘‘ఊహాగానాలను ఆపేయండి. కత్రినా ఇప్పటివరకు ధ్రువీకరించని విషయాన్ని ప్రచారం చేయకండి’’ అని టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

Blog Image

ఆప్ మాజీ మంత్రికి ఊరట

మనీలాండరింగ్‌ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆప్ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్‌ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని.. తదుపరి విచారణ సమయంలో పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆరువారాలు వాయిదా వేయడాన్ని సవాల్‌ చేస్తూ సత్యేందర్‌ జైన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Blog Image

జగన్‌ లేఖపై మంత్రి నిమ్మల సెటైర్లు

AP: అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ స్పీకర్‌కు జగన్ లేఖ రాయడం తెలిసిందే. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు సెటైర్లు వేశారు. జగన్‌ ప్రజల్లో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. జగన్‌కు ప్రతిపక్షం, ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని ఎద్దేవాచేశారు. చేసిన తప్పులపై సమీక్ష చేసుకోవాలని హితవు పలికారు.

Blog Image

టీడీపీ నేతలకు పేర్ని నాని సవాల్

AP: టీడీపీ నేతలకు మాజీమంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. ‘‘హైదరాబాద్‌లోని సీఎం చంద్రబాబు ఇంటిని హోమ్ టూర్ వేద్దాం. జగన్ ఇంటిని కూడా హోం టూర్ వేద్దాం. ఈ ఇళ్లపై రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆడిట్‌కు మీరు సిద్ధమా.’’అని అన్నారు. వైఎస్ జగన్ క్యాంపు ఆఫీస్‌లోని ఫర్నీచర్‌ను తీసుకెళ్లమంటే తీసుకెళ్లలేదు. వాటి ఖరీదు చెబితే డబ్బులు ఇస్తాం అని నాని అన్నారు.

Blog Image

తొలి వరల్డ్‌కప్‌ గెలిచి 41 ఏళ్లు.. సచిన్ ఏమన్నారంటే?

భారత్ తొలి ప్రపంచకప్ గెలిచి నేటికి 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘41 ఏళ్ల క్రితం జరిగినప్పటికీ ట్రోఫీ గెలుపొందిన రోజు రాత్రి నాకు ఇంకా గుర్తుంది. 1983 WCను ఇండియా గెలిచినప్పుడు నా ఇంటి పరిసరాల్లోని ప్రజలు నృత్యాలు చేస్తూ, టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.

Blog Image

తిరుపతన్న, భుజంగరావు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

TG: తిరుపతన్న, భుజంగరావు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్న, భుజంగరావు జైలులో ఉన్న విషయం తెలిసిందే.