shape

All News ChotaNews

రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13, జూన్ 4న జీతంతో కూడిన సెలవు దినాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. కాగా ఈ నెల 13న రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

నేడు అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్

నేడు అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈసారి సరికొత్త అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్‌లైనర్‌లో ప్రయాణించనున్నారు. ఈరోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ మూడో సారి అంతరిక్ష ప్రయాణం ప్రారంభిస్తారు. ISSకి స్టార్ లైనర్ ప్రయాణానికి దాదాపు 26 గంటలు పట్టే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్‌’ స్కోర్‌ చెల్లుబాటు

ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్‌’ స్కోర్‌ చెల్లుబాటు

అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్‌(టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌) స్కోర్‌ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్ సర్వీస్‌(ETS) వెల్లడించింది. గతేడాది జులై నుంచి ఈ స్కోరును అనుమతించడాన్ని నిలిపివేసిన ఆస్ట్రేలియా హోం మంత్రిత్వశాఖ.. తాజాగా దీన్ని పరిగణనలోకి తీసుకుంది. 2024 మే 5 లేదా ఆ మరుసటి రోజు నుంచి టోఫెల్‌ రాసిన వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ

నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ

ప్రధాని మోదీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు రాత్రి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. రాత్రికి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్న ఆయన.. రేపు(మే 8) వేములవాడ, వరంగల్ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం ఏపీలోని పీలేరు బహిరంగ సభ, విజయవాడలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు.

వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈనెల 5న పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రానికి పార్టీ కండువాతో వచ్చారని YSR కడప జిల్లా రిటానింగ్ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సుధీర్‌ రెడ్డిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారులే.

రీ ఎంట్రీ ఇస్తున్న మన్మథుడు బ్యూటీ

రీ ఎంట్రీ ఇస్తున్న మన్మథుడు బ్యూటీ

మన్మథుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అన్షు అంబానీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో ఓ కీలక పాత్రలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు

ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు(25) కోల్పోయిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్(21), పంజాబ్ కింగ్స్(18), లక్నో సూపర్ జెయింట్స్(18), సన్ రైజర్స్ హైదరాబాద్(17) ఉన్నాయి. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లోనూ MI 4.1 ఓవర్లలో టాప్-3 వికెట్లను సమర్పించుకుంది.

ట్రోల్ వీడియోపై స్పందించిన మోదీ

ట్రోల్ వీడియోపై స్పందించిన మోదీ

ప్రధాని మోదీపై కృష్ణ అనే వ్యక్తి ఎక్స్‌లో తాజాగా ఓ మీమ్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన మోదీ..చాలా సరదాగా స్పందించారు. ఆ పోస్ట్‌ను రీపోస్ట్‌ చేయడమే కాకుండా ‘మీలాగే నేనూ నా డ్యాన్స్‌ చూసి ఎంజాయ్‌ చేశా’ అంటూ మోదీ రీపోస్ట్ చేశారు. ఎన్నికల వేళ ఇలాంటి సృజనాత్మకత సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. దీంతో ప్రధానిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’

ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’

రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1 శివ’. ఈ సినిమాలోని ‘కేసరియా’ సాంగ్‌ స్పాటిఫైలో రికార్డులు బద్దలు కొట్టింది. స్పాటిఫైలో 500 మిలియన్‌ స్ట్రీమింగ్స్‌ దాటిన తొలి పాటగా రికార్డు సృష్టించింది. సోనీ మ్యూజిక్‌ ఇండియా ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషం వ్యక్తంచేసింది. అమిత్‌ భట్టాచార్య సాహిత్యం అందించిన పాటను అర్జిత్‌సింగ్‌ ఆలపించారు.

SRHపై ముంబై ఘన విజయం

SRHపై ముంబై ఘన విజయం

SRHతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైలో సూర్యకుమార్(102), తిలక్ వర్మ(37) పరుగులతో చెలరేగి ఆడడంతో.. ముంబై కేవలం 17.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది. అటు SRH బౌలర్లలో భువనేశ్వర్, కమిన్స్, యాన్సెన్ తలో వికెట్ తీసుకున్నారు.

సీఎం జగన్‌కు ఈసీ షాక్

సీఎం జగన్‌కు ఈసీ షాక్

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టింది. జగన్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొన్న ఈసీ.. ఇకపై ఇటువంటి తప్పులు పునరావృతం చేయొద్దని హెచ్చరించింది. కాగా జగన్ నిర్వహించిన సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై పలు పరుష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సైనికులకు పుతిన్ కీలక ఆదేశాలు

సైనికులకు పుతిన్ కీలక ఆదేశాలు

ఉక్రెయిన్‌తో యుద్ధం సాగిస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యానికి మరో కీలక ఆదేశం ఇచ్చారు. ఉక్రెయిన్‌ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని ఆదేశించారు. విన్యాసాల్లో భాగంగా.. సన్నద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటామని.. వ్యూహాత్మక అణ్వాయుధాలను వినియోగిస్తామని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే వీటి కసరత్తు మొదలవుతుందని తెలిపింది.

ఢిల్లీలో పరిశీలకులను నియమించిన కాంగ్రెస్

ఢిల్లీలో పరిశీలకులను నియమించిన కాంగ్రెస్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. ఈశాన్య ఢిల్లీకి సచిన్ పైలట్, నార్త్ వెస్ట్ ఢిల్లీకి చౌదరి బీరేందర్ సింగ్, చాందినీ చౌక్ పార్లమెంట్ నియోజకవర్గానికి డాక్టర్ సి.పి.జోషిని పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

‘నేను పిడికిలి బిగించగానే మళ్ళీ రైతు బంధు పడుతుంది’

‘నేను పిడికిలి బిగించగానే మళ్ళీ రైతు బంధు పడుతుంది’

నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో BRS అధినేత కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ హామీలు నెరవేర్చకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు వరి పంటకు బోనస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌..ఇచ్చిందా? అని ప్రశ్నించారు. తాను బస్సెక్కి పిడికిలి బిగించగానే మళ్లీ రైతుబంధు పడుతోందని..తెలంగాణ గళం,బలం BRS మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే BRS గెలవాలన్నారు.

ఈటలపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

ఈటలపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

TG: మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బలహీనవర్గాల కోసం ఏమైనా చేశారా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఉప్పల్‌లో మాట్లాడుతూ.. పంపకాల్లో కేసీఆర్‌తో తేడా వచ్చి రాజేందర్‌ బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చారని విమర్శించారు. అంతేతప్ప ప్రజలకోసం కాదని ఆరోపించారు. ఉప్పల్‌లో పనులు నిలిచిపోయిన ఫ్లైఓవర్‌ గురించి కేంద్రాన్ని ఎప్పుడైనా అడిగారా అని నిలదీశారు. కరోనా సమయంలో సీఎస్‌ఆర్‌ నిధులు దోచుకుతింటుంటే నోరెత్తలేదన్నారు.

ఇవి అచ్చేదిన్ కాదు.. చచ్చేదిన్: కేసీఆర్‌

ఇవి అచ్చేదిన్ కాదు.. చచ్చేదిన్: కేసీఆర్‌

TG: ప్రధాని మోదీపై మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ సెటైర్లు వేశారు. రైతుల ఆదాయం రెట్టింపుకాకపోగా.. సాగు ఖర్చులు రెట్టింపు అయ్యాయని అన్నారు. నిజామాబాద్‌‌లో మాట్లాడుతూ.. మోదీ పాలనలో తెలంగాణకు ఏమైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో మోదీ 150 నినాదాలిచ్చారని.. అందులో ఒక్కటైనా నిజమైందా అని అడిగారు. మోదీ అచ్చేదిన్‌ అంటే.. రైతులు చచ్చేదిన్‌ వచ్చిందని దుయ్యబట్టారు.

అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు: సీఎం

అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు: సీఎం

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ప్రజా ప్రతినిధులపై హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుఖు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులని అన్నారు. పౌరుల మనోభావాలను కించపరచడమే కాకుండా ఎన్నికలపై అనవసర భారం మోపుతారని అన్నారు. హమీర్పూర్‌ జిల్లాలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో హిమాచల్‌ సీఎం ఈవిధంగా వ్యాఖ్యానించారు.

ముద్రగడ ముఖ్య అనుచరుల సమావేశం

ముద్రగడ ముఖ్య అనుచరుల సమావేశం

ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా తలపడతున్న తరుణంలో అనుచరులు సైతం ప్రతిపక్షంగా మారుతున్నారు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్య అనుచరులు విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా పని చేయాలని నేతలు తీర్మానించారు.

MI vs SRH: ముంబై లక్ష్యం ఎంతంటే..

MI vs SRH: ముంబై లక్ష్యం ఎంతంటే..

టాస్ ఓడిన హైదరాబాద్.. ముంబై ముందు మాదిరి లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగలిగింది. హెడ్ (48), కమ్మిన్స్ (35) నితీశ్ (20), పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో పాండ్యా, పీయూష్ 3.. బుమ్రా, అన్షుల్ 1 చొప్పున వికెట్లు తీశారు. ముంబై విజయానికి 174 పరుగులు చేయాల్సి ఉంది.

‘జై శ్రీరామ్ అనని వాళ్లు పాకిస్థాన్‌కు వెళ్లిపోవచ్చు’

‘జై శ్రీరామ్ అనని వాళ్లు పాకిస్థాన్‌కు వెళ్లిపోవచ్చు’

'జై శ్రీరామ్' అనడానికి ఇష్టపడని వారు పాకిస్థాన్‌కు వెళ్లవచ్చు అని బీజేపీ నేత, నటి నవనీత్ కౌర్ అన్నారు. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆమె కచ్ లోక్‌సభ అభ్యర్థి వినోద్ చావ్డాకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు తాజగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.

‘దీదీగిరి’ని అంగీకరించను: గవర్నర్

‘దీదీగిరి’ని అంగీకరించను: గవర్నర్

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్పందించారు. ‘గవర్నర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సీఎం నన్ను రాజకీయాల్లోకి లాగినందుకు చాలా చింతిస్తున్నాను. మమత నాపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అయినా.. ఆమెను రక్షించమని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అయితే, ఆమె దీదీగిరిని మాత్రం ఎప్పటికీ అంగీకరించను’’ అని చెప్పుకొచ్చారు.

‘‘RRR’’కు రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

‘‘RRR’’కు రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ మార్చి 25, 2022న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఈ చిత్రం రీ-రిలీజ్‌కు రెడీ అయ్యింది. మే 10, 2024న తెలుగు, హిందీ భాషలలో 2డి, 3డి ఫార్మాట్‌లలో విడుదల కానుంది. మరి ఈ చిత్రం రీ-రిలీజ్‌కు ఎలాంటి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఈతకు వెళ్లి ఐదుగురు మెడికోలు దుర్మరణం

ఈతకు వెళ్లి ఐదుగురు మెడికోలు దుర్మరణం

సముద్రంలో ఈతకు వెళ్లి ఐదుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరుచిరాపల్లిలోని ఎస్‌ఆర్‌ఎం మెడికల్ కాలేజీకి చెందిన పలువురు మెడికోలు తమ స్నేహితుడి వివాహ వేడుక నిమిత్తం కన్యాకుమారికి వచ్చారు.పెళ్లి ముగియగానే దగ్గరలోని కన్యాకుమారి తీరంలోని బీచ్‌కి వెళ్లారు. ఈత కోసం సముద్రంలోకి దిగగా..అలలు పెద్ద ఎత్తున రావడంతో ఐదుగురు విద్యార్థులు సముద్రంలో కొట్టుకుపోయి మృతి చెందారు.

కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్

కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్

TG: అంబర్‌పేట్ కార్నర్ మీటింగ్‌లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మేము పథకాలను అమలుచేయలేదని కేటీఆర్ విమర్శిస్తున్నారు. అందుకే కేటీఆర్ మీరే.. చీర కట్టుకొని బస్సు ఎక్కండి. మిమ్మల్ని డబ్బులు అడిగితే పథకాల అమలు జరగనట్లు. పైసలు అడగకుంటే.. పథకాల అమలు జరిగినట్లే. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతూ తండ్రికొడుకులు కాలం వెళ్లదీస్తారు’ అని విమర్శించారు.

ప్రధాని గ్యారంటీలకు కాలం చెల్లింది: సీఎం రేవంత్

ప్రధాని గ్యారంటీలకు కాలం చెల్లింది: సీఎం రేవంత్

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అంబర్‌పేట్‌లో మాట్లాడుతూ.. పదేళ్లలో అంబర్‌పేట్ బ్రిడ్జిని కిషన్‌ రెడ్డి ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్రం నుంచి నిధులను ఎందుకు తీసుకురాలేదని అడిగారు. ప్రధాని మోదీ గ్యారంటీలకు కాలం చెల్లిందని మండిపడ్డారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌లోనే నిరుద్యోగం, పేదరికం పెరిగాయని పేర్కొన్నారు.

ఆసక్తిరేపుతున్న ‘సత్య’ ట్రైలర్

ఆసక్తిరేపుతున్న ‘సత్య’ ట్రైలర్

హమరేశ్, ప్రార్ధన సందీప్ జంటగా నటించిన చిత్రం ‘సత్య’. ఈ చిత్రాన్ని వాలీ మోహన్‌దాస్ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

రిషి సునాక్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

రిషి సునాక్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

యూకేలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో సార్వత్రిక ఎన్నికల కోసం ఒత్తిడి తెచ్చేందుకు ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వంపై లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించనున్నట్లు ఆ పార్టీ సోమవారం తెలిపింది. గత వారం జరిగిన స్థానిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 474స్థానిక కౌన్సిల్ స్థానాలను కోల్పోయింది.

బెంగళూరులో వడగళ్ల వాన

బెంగళూరులో వడగళ్ల వాన

బెంగళూరులో వడగళ్ల వర్షం కురుస్తోంది. నగరంతో పాటు కర్ణాటకలోని పలు జిల్లాలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. కొన్ని రోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన బెంగళూరు ప్రజలకు తాజా వర్షం ఉపశమనం లభించింది. రెండు నెలలుగా తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడ్డ నగర వాసులు ఈ వర్షంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆ గుడిలో రవీనా టాండన్ ప్రత్యేక పూజలు

ఆ గుడిలో రవీనా టాండన్ ప్రత్యేక పూజలు

బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఆధ్యాత్మిక బాటపట్టారు. తాజాగా తన కుమార్తె రషా తడానితో కలిసి పూణెలోని భీమశంకర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రవీనా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ఏపీ ఎన్నికలపై ప్రధాని మోదీ ట్వీట్

ఏపీ ఎన్నికలపై ప్రధాని మోదీ ట్వీట్

ఎన్నికల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏపీ ఎన్నికల్లో ఆయన రాజమండ్రి, అనకాపల్లిలో కూటమి అభ్యర్థుల తరపు ప్రచార సభలో మాట్లాడారు. సభ అనంతరం రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలపై ఆయన ట్వీట్ పెట్టారు. ‘కూటమికి ఏపీలో ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ ఆదరణతో ప్రత్యర్థులకు నిద్ర పట్టడంలేదు. ఏపీలో ఎన్డీయే గాలి వీస్తోంది.’అని మోదీ ట్వీట్ చేశారు.

చేపల వేట పడవలో పారిపోయి వచ్చిన భారతీయులు

చేపల వేట పడవలో పారిపోయి వచ్చిన భారతీయులు

ఆరుగురు భారతీయులతో ప్రయాణిస్తున్న ఇరాన్‌కు చెందిన చేపలవేట పడవను కోస్ట్‌గార్డ్‌ అదుపులోకి తీసుకొంది. మత్స్యకారులు తమిళనాడుకు చెందిన కన్యాకుమారికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఇరాన్‌కు చెందిన సయ్యద్‌‌సౌదీ అన్సారీ వద్ద కాంట్రాక్టుపై పనిచేస్తున్నారు. యజమాని తమను దారుణంగా చూస్తున్నాడని సదరు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కనీస జీవనావసరాలను కూడా తీర్చడం లేదని తెలిపారు. అందుకే చేపలు పట్టే పడవలోనే పారిపోయి వచ్చినట్లు పేర్కొన్నారు.

ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

AP: మరో వారంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం తనకు లేదన్నారు. అధికారులను ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను లేకుండా చేయాలనేదే ప్రతిపక్షాల కుట్ర అని జగన్ ఆరోపించారు. ఇటీవల ఎన్నికల సంఘం అధికారులను బదిలీ చేస్తున్న సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.