శుభోదయం
శుభోదయం
శుభోదయం
‘బిగ్‌బాస్’ బ్యూటీ దివి వాద్యా సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ భామ తాజాగా శారీ పిక్స్ షేర్ చేయగా వైరలవుతున్నాయి.
ఆంటీ అని పిలిచినందుకు ATM సెక్యూరిటీ గార్డును ఓ మహిళ కొట్టిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. ఆ మహిళ డబ్బు తీసుకున్న తర్వాత ఇతరులకు దారి ఇచ్చేందుకు ఆమెను పక్కకి వెళ్లమని గార్డు కోరాడు. ఆ తరుణంలోనే ఆ మహిళను గార్డు ‘ఆంటీ’ అని పిలవగా.. కోపగించుకుని అతనిని చెప్పుతో కొట్టింది. దీంతో ఆ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలంగాణలో త్రిమూర్తులు ఉండే ఆలయం?
సండే మజా 24 సెప్టెంబర్ 23
ఎంత మంది కారులో ఆఫీసుకు వెళ్తున్నారు?
అమెజాన్ ఉందని ఆన్‌లైన్‌లో ఏది పడితే అది బుక్ చేసేస్తున్నాం. అదే మన పర్యావరణానికి భారీ నష్టాన్ని మిగుల్చుతోంది. దీని వల్ల కలిగే నష్టాలేంటో పై వీడియోలో చూడండి.
శుభ సోమవారం
పలువురు అమెరికా బిజినెస్‌మెన్లు ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామని అన్నారు. వారం రోజులపాటు జెలెన్ స్కీ అమెరికా, కెనడాలో పర్యటించి.. పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. మెకేల్ బ్లూమ్‌బర్గ్, లారీ ఫింక్, బిల్ అక్మాన్ వంటి వ్యాపారవేత్తలు సైతం ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
చట్టబద్ధంగా, అక్రమంగా వలస వచ్చినవారు.. అమెరికా జనాభాలో 13.9 శాతం ఉన్నారని ఇటీవల అమెరికా విడుదల చేసిన జన గణన నివేదిక తెలిపింది. అమెరికా మొత్తం జనాభా ప్రస్తుతం 33 కోట్లు. అందుకే అక్కడ జన్మిస్తున్న ఏడుగురిలో ఒకరు విదేశీ సంతతివారేనని నివేదిక పేర్కొంది. 2022 ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం.. ఇమ్మిగ్రేంట్స్‌లో భారతీయులు,చైనీయులు 6% ఉండగా.. అందరికంటే ఎక్కువగా మెక్సికన్లు ఉన్నారట.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగా, రచయిత్రిగా సుధామూర్తి అందరికీ సుపరిచితమే. అమెరికాలో జరిగే ఈవెంట్లకు ఆమె హాజరవుతారని పేర్కొంటూ కొందరు డబ్బులు వసూలు చేశారు. తనకు సంబంధం లేని కార్యక్రమాల పేరు చెప్పి నగదు వసూలు చేస్తున్నారన్న విషయం సుధామూర్తి దృష్టికి రావడంతో ఆమె సీరియస్‌గా స్పందించారు. ఈ అంశంపై బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. శృతి హాసన్ కథనాయిక. ఈ మూవీ గురించి శృతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ లార్జర్ దేన్ లైఫ్ మూవీ అని.. ప్రభాస్ చాలా వండర్‌ఫుల్, హంబుల్ అని చెప్పుకొచ్చారు. శృతి హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వచ్చే 4-5 ఏళ్లలో భారత్‌లో ప్రొడక్షన్‌ను ఐదు రెట్లు పెంచాలని ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి లక్ష్యంలో 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.32 లక్షల కోట్లు)కు చేరాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ USD 7 బిలియన్ల ఉత్పత్తి మార్కును అధిగమించింది.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఆర్ట్ గ్యాలరీలోని 1.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.12.5 కోట్లు) విలువైన శతాబ్దాలనాటి జపాన్ కాంస్య బుద్ధ విగ్రహం ఇటీవల చోరీకి గురైంది. బెవర్లీ గ్రోవ్‌లోని బరాకత్ గ్యాలరీలో 113 కిలోల బరువున్న ఈ శిల్పం చోరీకి గురైందని లాస్ ఏంజిల్స్ పోలీసులు తెలిపారు. ఈ పురాతన బుద్ధుడి విగ్రహం 1603-1867 నాటిదని గ్యాలరీ యజమాని ఫయేజ్ బరాకత్ చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ పోలీసులు ఐదుగురు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 పిస్టల్స్, 3 హ్యాండ్ గ్రెనేడ్‌లు, 1 UBGL, 2 పిస్టల్ మ్యాగజైన్‌లు, ఇతర యుద్ధ తరహా స్టోర్‌లతో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసుకొని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. జనాలలోనే ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారిని హైబ్రిడ్ ఉగ్రవాదులు అంటారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో పెను ప్రమాదం తప్పింది. అక్కడ ప్రతిష్టించిన వినాయకుడిని చూడటానికి పదుల సంఖ్యలో వ్యక్తులు గుమ్మిగూడగా.. ఆ బరువుకు తట్టుకోలేక డ్రైనేజీ స్లాబ్ కూలింది. ఈ ఘటనలో దాదాపు 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 11 అంబులెన్స్‌లలో క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చంద్రముఖి 2’. త్వరలో విడుదల కానున్న మూవీ గురించి మాట్లాడుతూ.. ‘రెబల్ తర్వాత తెలుగులో మరో సినిమాను డైరెక్ట్ చేయడం కుదర్లేదు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను కలవడం ఆనందంగా ఉంది. కష్టపడి సంపాదించిన డబ్బుతో టికెట్ కొనుక్కుని మమ్మల్ని చూస్తున్నారు. ఏం ఆశించకుండా మాపై అభిమానం చూపిస్తున్నారు. మీ ప్రేమలో దేవుణ్ని చూస్తున్నాన’ని చెప్పుకొచ్చారు.
అత్యంత ఖరీదైన దేశాల్లో దుబాయ్ ఒకటి. అక్కడ ఏటికేడు రియల్ ఎస్టేట్ పెరుగుతూ పోతోంది. అందులోనూ భారతీయులు అక్కడ ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారట. 2021లో దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో ఇండియన్స్ సుమారు 900 కోట్ల దిర్హామ్‌లు పెట్టుబడి పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. దానికి ప్రధాన కారణం అది ప్రముఖ దేశాలకు నడుమ ఉండి.. ప్రయాణాలకు అనుకూలంగా ఉండడం.
డిజిటలైజేషన్‌కు ముందు డీమ్యాట్ ఖాతా తెరిచే ప్రక్రియ చాలా కష్టంగా ఉండేదని స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఒకప్పుడు స్టాక్ బ్రోకరేజ్‌లో ఖాతా తెరవాలంటే ప్రతీ కస్టమర్ 40 పేజీలున్న ఫారమ్‌పై సంతకం చేసి కొరియర్ పంపేవారని తెలిపారు. అప్రూవ్ కోసం రోజుల తరబడి వేచిఉండాల్సి వచ్చేదన్నారు. డిజిటలైజేషన్‌తో డీమ్యాట్ ఖాతాలు తెరిచే ప్రక్రియ వేగవంతం అయిందన్నారు.
TS: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్పులు చేర్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.. మనిషి ఆశాజీవి కదా! మార్పులు చేర్పులు జరిగితే బీఫామ్ తనకే వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కడియం ప్రస్తుత ఎమ్మెల్యే కలసిపోయారనుకున్న తరుణంలో రాజయ్య వ్యాఖ్యలు మరోసారి సంచలనమయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒకేరోజు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. స్వచ్ఛత కోసం ఒక గంట శ్రమదాన్ కార్యక్రమాన్ని అక్టోబర్ 1న నిర్వహించనున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ వెల్లడించింది. గాంధీ జయంతిని (అక్టోబర్ 2) పురస్కరించుకొని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దీన్ని చేపట్టనున్నట్లు తెలిపింది.
TS: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు నియోజకవర్గ సర్పంచులు ఝలక్ ఇస్తున్నారు. మల్యాల మండలంలో అన్ని గ్రామాల లబ్ధిదారులకి ఈ రోజు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేయగా… కార్యక్రమానికి ముగ్గురు సర్పంచులు హాజరుకాలేదు. అంతే కాకుండా కార్యక్రమానికి వచ్చిన ఎనిమిది మంది సర్పంచులు ప్రోగ్రాంను బాయ్‌కాట్ చేశారు. సర్పంచులు కార్యక్రమం నుంచి వెళ్లి.. కొండగట్టులో మీటింగ్ పెట్టుకున్నారు.
కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్‌లు.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో వెబ్‌క్యామ్‌లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే వెబ్‌క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్‌ఫోన్‌లే వెబ్‌క్యామ్‌లుగా మారిస్తే బాగుంటుంది కదా.. అవును అలాంటి ఫీచర్‌నే గూగుల్ తీసుకొస్తోంది. వెబ్‌క్యామ్‌లకు బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించే ఫీచర్‌పై గూగుల్ కసరత్తు చేస్తోంది.
AP: గత కొంతకాలంగా జనసేన నేత పవన్ కల్యాణ్, వైసీపీ నేత అంబటి రాంబాబు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా పవన్‌పై అంబటి మరోసారి సెటైర్లు వేశారు. ‘సుయ్.. లేదు, సై.. లేదు షూటింగ్‌లో ఉన్నారా?. పునరాలోచనలో ఉన్నారా?’ అని ట్వీట్ చేశారు.
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ రచయిత ప్రయాగ్ రాజ్ మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సాయంత్రం బాంద్రాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఆదిత్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వయసు 88 కాగా.. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ హిట్స్ అమర్ అక్బర్ ఆంథోనీ, నసీబ్, కూలీ చిత్రాలకు పనిచేశారు.
తెలంగాణ రాష్ట్ర BJP అధ్యక్షుడు కిషన్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. అతనిని పదవి నుంచి తొలగించి తిరిగి బండి సంజయ్‌ని అధ్యక్షుడిగా నియమించాలని ఆ ఆడియోలో ఉంది. సంజయ్ ఉంటేనే పార్టీ ఫామ్‌లోకి వస్తుందని అంటున్నారు.
ఆసీస్ మీద రెండో వన్డేలో కూడా ఇండియా భారీ విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా గిల్, అయ్యర్, రాహుల్, సూర్య రాణించడంతో భారీ స్కోర్ చేసింది. ఇక బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఇండియా 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండియా 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
నాసా చేపట్టిన ఆస్ట్రాయిడ్ మిషన్ సక్సెస్ అయింది. దాదాపుగా ఏడేళ్ల తరువాత బెన్నూ అనే గ్రహశకలంపై నుంచి నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. నేడు అమెరికా ఊటా రాష్ట్రంలో ఎడారిలో నాసా క్యాప్సూల్ దిగింది. నాసా 2016లో ‘ఒరిసిస్ రెక్స్’ అనే స్పేస్ ప్రోబ్‌ను అంతరిక్షంలోకి పంపింది. సుమారు మూడేళ్ళు ప్రయాణించి బెన్నూ అనే గ్రహశకలాన్ని చేరింది. మొత్తంగా భూమిని చేరడానికి ఏడేళ్లు పట్టింది.
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడానికి తమ పార్టీదే బాధ్యత అని కెనడా అధికార పార్టీఎంపీ చంద్రఆర్య పేర్కొన్నారు. ఉగ్రవాదులు చేసిన బెదిరింపులతో కెనడా హిందువుల్లో భయం నెలకొందని భారత సంతతి వ్యక్తి అయిన లిబరల్ పార్టీ సభ్యుడు చంద్రఆర్య స్పష్టం చేశారు. ప్రధాని ట్రూడో పార్టీకి చెందిన ఆయన.. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో హిందూకెనడియన్లు సంయమనంతో ఉండాలని మరోసారి సూచించారు.
విశాఖ: గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న బాలాజీ గార్డెన్స్‌లో ఆదివారం ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి పెందుర్తి పోలీసులు చేరుకున్నారు. మృతురాలిని రాధా గాయత్రి(45)గా పోలీసులు గుర్తించారు. మృతురాలి ఒంటిపై బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్య ఆదివారమే జరిగిందా? లేదంటే శనివారం రాత్రి జరిగిందా అనేది స్పష్టత లేదు.
ఏసియన్ గేమ్స్-2023లో డే 1 కంప్లీట్ అయింది. మన ఇండియన్లు ఈ రోజు 5 మెడల్స్ (3 సిల్వర్, 2 బ్రాంజ్) గెలిచారు. షూటింగ్ (వుమెన్స్ 10M ఎయిర్ రైఫిల్ టీమ్), రోయింగ్, రోయింగ్ (మెన్స్ పెయిర్), షూటింగ్ (వుమెన్స్ 10M ఎయిర్ రైఫిల్)లలో మెడల్స్ గెల్చుకున్నారు. మరి ఇండియాకు గోల్డ్ కల ఎప్పుడు నెరవేరుతుందో?
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం ఘనంగా జరిగింది. రేపు నిర్వహించనున్న శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపన చేశారు. ప్రధాన కల్యాణకట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డికి అప్పగించారు.
మణిపూర్, మయన్మార్ మధ్య కంచె ఏర్పాటు అర్జెంటుగా అవసరమని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ అన్నారు. పొరుగు దేశం మయన్మార్ నుంచి అక్రమ వలసదారులను అడ్డుకోవాలంటే త్వరగా కంచె ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈరోజు 70కిలోమీటర్ల మేర కంచె ఏర్పాటు గురించి చర్చించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతోపాటు మయన్మార్ నుంచి వచ్చే కొన్ని అదృశ్య శక్తులు మణిపూర్‌లో అల్లర్లకు కారణమవుతున్నాయన్నారు.
రెండో వన్డేలో ఆసీస్ మీద ఇండియా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 78 బంతుల్లో 181 పరుగులు చేయాలి. కాసేపటి క్రితమే గ్రీన్ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. ప్రస్తుతం జంపా, అబాట్ ఉన్నారు. వీరు ఎలాగూ అంత స్కోర్ కొట్టలేరు.. కావున ఇండియా గెలవడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తిరుపతి: తిరుమల శ్రీవారికి ఆదివారం స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భాగంగా రంగురంగుల గాజులు, ఆప్రికాట్ ఫలాలు, వట్టివేరు, కురువేరు, రోజామాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
ప్రకాశం: ఈనెల 9న చంద్రబాబుని అరెస్టు చేయగా అదే రోజు సాయంత్రం ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలోని ఆంధ్ర కాలనీకి చెందిన ఎండ్లూరి చిన్న కోటయ్య తన ఇంట్లో టీవీ చూస్తూ.. చంద్రబాబు అరెస్టు వార్తలతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఒంగోలులోని ప్రైవేటు హాస్పిటల్‌లో 11 రోజులు చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం చిన్న కోటయ్య చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నవనీత కృష్ణుడి అలంకారంతో విశేష తిరువాభరణాలు ధరించి స్వామివారు చల్లని వెన్నెల్లో చంద్రప్రభ వాహనంపై విహరించారు. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. వాహనసేవ ముందు కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. గత నాలుగు నెలలుగా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు చెల్లించలేని దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డుపై.. ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగా స్పాన్సర్‌షిప్ లోగోలను, ప్రపంచ కప్ ప్రమోషన్లను బహిష్కరిస్తామని ఆటగాళ్లు పీసీబీని బెదిరించినట్లు నివేదికలు చెప్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఏపీ, తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు మద్దతుగా అమీర్‌పేటలోని సారథి స్టూడియో నుంచి ఆర్బీఐ క్వార్టర్స్ ఎన్టీఆర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలతో పాటు చంద్రబాబు మద్దతు దారులు భారీగా హాజరై బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పాల్గొన్నారు.
రెండో వన్డేలో ఇండియా మీద గెలవాలంటే ఆసీస్ ఇంకా 216 పరుగులు చేయాలి. వారి వద్ద కేవలం 20 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. క్రీజులో అలెక్స్ కేరి (1*), ఇంగ్లిస్ (6*) ఉన్నారు. చేతిలో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఆసీస్ గెలుస్తుందో.. లేదో. ఈ మ్యాచ్ ఓడితే ఆసీస్ సిరీస్ కోల్పోతుంది.
రెండో వన్డేలో ఆసీస్ ఇంకా 24 ఓవర్లలో 261 పరుగులు చేయాలి. అంటే ఓవర్‌కు 10+ పరుగులు చేయాలి. మరి ఆసీస్ వల్ల ఇది సాధ్యం అవుతుందా.. కామెంట్ కరో.
ఇండియా-ఆస్ట్రేలియా రెండో వన్డే 8.35కు స్టార్ట్ కానుంది. 33 ఓవర్ల మ్యాచ్ జరగనుంది. అంటే ఆసీస్ ఇంకా 24 ఓవర్లు ఆడాలి. ఆసీస్‌కు 33 ఓవర్లలో 317గా టార్గెట్ నిర్ణయించారు. ప్రస్తుతం 9 ఓవర్లకు 56 పరుగులు చేసింది కావున… ఇంకా 24 ఓవర్లలో 261 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.
పాతబస్తీలో బస్సు బీభత్సం సృష్టించింది. జూపార్కు నుంచి పురాణాపూల్ వైపు వెళ్తున్న ఆటోను బహదూర్‌పురా క్రాస్ రోడ్డు సిగ్నల్ వద్ద వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. ఆర్టీసీ బస్సు రాజేంద్రనగర్ డిపోకి చెందినదిగా గుర్తించారు.
మన్యం: ఈరోజు ఉదయం విశాఖపట్నం కేజీహేచ్ ఆస్పత్రిలో గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు పంచాయితీ కొత్తవలస గ్రామానికి చెందిన 2నెలల పసిబిడ్డ అనారోగ్యంతో చనిపోయింది. బాధితుల దగ్గర కనీసం ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవటంతో కేజీహెచ్ స్టాఫ్ ఒకరు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి ఫోన్‌చేసి విషయం తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే కారు బుక్‌చేసి, వాళ్ళకి భోజనం ఖర్చులకి డబ్బులిచ్చి బిడ్డని గ్రామానికి చేర్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు ఛత్తీస్‌గడ్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు బిలాస్‌పూర్ పర్శాడలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఆయన పర్యటన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కీలకంగా పరిగణించే రెపోరేటును ఈసారి కూడా RBI 6.5శాతం వద్ద యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం, రానున్న రోజుల్లో కఠిన విధాన వైఖరిని అవలంభించనున్నామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వడ్డీరేట్లు పెరగక పోవచ్చని తెలిపారు. ఒకవేళ అదే జరిగితే ఆర్‌బీఐ వరుసగా నాల్గవసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లవుతుంది.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఫ్యాన్స్ ముద్దుగా ‘రాగ్‌నీతి’ అని పేరు పెట్టారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సహా పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు.
దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా అసమర్థంగా వ్యవహరిస్తోందని విమర్శించింది. పైగా గణాంకాలు తారుమారు చేస్తోందని ఆరోపించింది. అదానీ స్కామ్, కుల గణన, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం వంటి సమస్యల నుంచి ద్రుష్టి మరల్చేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించిందని విమర్శించింది.
ఈ చిత్రంలో ఉన్నది ఒక రాజకీయ నేత.. అతనెవరో కామెంట్ చేయండి. క్లూ: ఇతడు చాలా రోజుల పాటు CMగా సేవలందించిన కామ్రేడ్.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నార్సింగ్, కాటేదాన్, బండ్లగూడ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఇయాళ సండే కావడంతో గణనాథులను నిమజ్జనం చేసేందుకు అంతా ప్లాన్ చేసుకున్నారు. కానీ హఠాత్తుగా వర్షం కురవడంతో అంతా అప్‌సెట్ అవుతున్నారు.